చిరు, బాలయ్య, నాగ్, వెంకీ.. సిస్టర్ సెంటిమెంట్!
on Jul 11, 2022

నిన్నటి తరం అగ్ర కథానాయకులైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆసక్తికరమైన చిత్రాలతో అభిమానుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వీరంతా `సిస్టర్ సెంటిమెంట్`తో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `గాడ్ ఫాదర్`. మలయాళ సినిమా `లూసీఫర్` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ దసరా కానుకగా రిలీజ్ కానుంది. కాగా, ఇందులో చిరుకి సోదరి తరహా పాత్రలో నయన తార కనిపించనుంది. మరోవైపు.. చిరు నటిస్తున్న ఇంకో సినిమా `భోళా శంకర్`లోనూ సిస్టర్ సెంటిమెంట్ కి స్కోప్ ఉండగా.. చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ దర్శనమివ్వనుంది.
ఇక బాలయ్య విషయానికి వస్తే.. దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో చేస్తున్న పేరు నిర్ణయించని చిత్రం సిస్టర్ సెంటిమెంట్ తో ముడిపడినదేనని టాక్. ఇందులో చెల్లిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోందని సమాచారం. అలాగే, దసరాకి రాబోతున్న నాగ్ `ద ఘోస్ట్`లో కూడా సిస్టర్ సెంటిమెంట్ ఉంది. సోదరిగా గుల్ పనాగ్ కనిపిస్తుందని అంటున్నారు. అదే విధంగా, సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం `కభీ ఈద్ కభీ దివాళి`లో వెంకీకి చెల్లెలుగా పూజా హెగ్డే అభినయిస్తోందని సమాచారం. మరి.. సిస్టర్ సెంటిమెంట్ తో సీనియర్ స్టార్స్ ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



