వెంకీ `వసంతం`కి 19 ఏళ్ళు!
on Jul 11, 2022

విక్టరీ వెంకటేశ్ కి అచ్చొచ్చిన కథానాయికల్లో ఆర్తి అగర్వాల్ ఒకరు. `నువ్వు నాకు నచ్చావ్` (2001) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రం `వసంతం`. విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కళ్యాణి ఓ ముఖ్య పాత్రలో దర్శనమిచ్చింది. ఆడ, మగ స్నేహం చుట్టూ అల్లుకున్న ఈ సినిమాలో అశోక్ గా వెంకీ, జూలీగా కళ్యాణి ఆకట్టుకున్నారు. ఆకాశ్, సునీల్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, హేమ, ఆహుతి ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, మాస్టర్ తేజ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా.. ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు.
ఎస్.ఎ. రాజ్ కుమార్ బాణీలు కట్టిన `వసంతం`కి వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, కులశేఖర్ సాహిత్యమందించారు. ఇందులోని ``గాలి చిరుగాలి``, ``అమ్మో అమ్మాయేనా``, ``నిను చూడక``, ``గోదారల్లే పొంగే``, ``జాంపండువే``, ``ఓ లాలీ పాపకి``, ``ఓ జాబిలి`` అంటూ సాగే పాటలు రంజింపజేశాయి. `బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్`, `స్పెషల్ జ్యూరీ` విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకున్న `వసంతం`ని ఎన్వీ ప్రసాద్, ఎస్. నాగ అశోక్ కుమార్ నిర్మించారు. 2003 జూలై 11న విడుదలై ఘనవిజయం సాధించిన `వసంతం`.. నేటితో 19 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



