Home

»

Latest News

నారా లోకేశ్‌తో భేటీ.. యాంకర్ ఉదయభాను సంచలన పోస్ట్.!

Nov 21, 2026 6:37PM

ప్రముఖ యాంకర్‌, నటి ఉదయభాను తాజాగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ భేటీ అనంతరం తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు ఉదయభాను. లోకేశ్‌ ఆలోచనా విధానం, సమాజం పట్ల ఆయనకున్న దృక్పథం, తన మాటలను శ్రద్ధగా విన్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆయనపై గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా పోస్ట్‌ పెట్టారు.

నారా లోకేశ్‌ను దూరదృష్టి కలిగిన నాయకుడిగా అభివర్ణించిన ఉదయభాను.. ఆయన ఆలోచనల్లో స్పష్టత, ప్రగతిశీల దృక్పథం, ఇతరుల పట్ల చూపించే నిజమైన శ్రద్ధ తనకు ఎంతో నచ్చాయని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తాను ఆలోచించిన కొన్ని ఆశయాలు, కార్యక్రమాలను ఆయనతో పంచుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని తెలిపారు.

అయితే ఈ సమావేశంలో తనను ఎక్కువగా ఆకట్టుకున్నది లోకేశ్‌ స్పందించిన తీరేనని ఉదయభాను చెప్పారు. తాను చెప్పిన విషయాలను ఎంతో శ్రద్ధగా వినడమే కాకుండా, వాటిపై లోతుగా అవగాహన చేసుకుని ఆలోచనాత్మకంగా స్పందించారని వెల్లడించారు. మెరుగైన భవిష్యత్తు కోసం మనం పెట్టుకున్న ఆశయాలను ఎదుటివారు అంతే నిబద్ధతతో స్వీకరించినప్పుడు కలిగే అనుభూతి ప్రత్యేకంగా ఉంటుందని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

కొన్ని సంభాషణలు మనసులో చిరకాలం నిలిచిపోతాయని, మరికొన్ని భవిష్యత్తులో గొప్ప మార్పులకు బాటలు వేస్తాయనే ఆశను కలిగిస్తాయని ఉదయభాను రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: ‘డ్రాగన్‌’లో చర్చి సీక్వెన్స్‌.. ఎన్టీఆర్‌, రుక్మిణి వసంత్‌పై భారీ పెళ్లి వేడుక!

ఉదయభాను తెలుగు టెలివిజన్‌ ప్రేక్షకులకు యాంకర్‌గా సుపరిచితురాలు. తనదైన మాటతీరుతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ఆమె సినిమాల్లోనూ నటించారు. తాజాగా నారా లోకేశ్‌తో భేటీ, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ఉదయభాను ప్రస్తావించిన సామాజిక కార్యక్రమాలు ఏమిటి? వాటిని అమలు చేసే దిశగా ఏమైనా ముందడుగు పడుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

మీకు నచ్చవచ్చు:
మహేష్ బాబు, అనిల్‌ రావిపూడి కాంబో రిపీట్‌.. అసలు ట్విస్ట్ ఏంటంటే.?
ప్రశాంత్‌ వర్మకు బిగ్ షాక్.. మరో ‘హనుమాన్‌ 2’ ప్రకటించిన ప్రొడ్యూసర్స్!

 

 

 

[Udaya Bhanu, Nara Lokesh, Meeting, Andhra Pradesh, Amaravati]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com