Home

»

Latest News

ఆ పవర్ తగ్గిందా! అభిమానులు, ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ!

Nov 21, 2026 6:09PM

మాటకి  ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక హోదా ఉంటాయని నిరూపించాడు త్రివిక్రమ్. ఆ పెన్ను నుంచి వచ్చిన  మాటని పలకడం  చాలా మంది గౌరవంగా భావించే వాళ్ళు. గౌరవం కూడా దొరికేది. అంత శక్తీ ఉంది త్రివిక్రమ్ మాటకి. అందుకే  'మాటల మాంత్రికుడు' అనే పేరు తనంతట తానుగా వచ్చి అయస్కాంతంలా పక్కనే అంటిపెట్టుకుంది.

 జీవిత సత్యాలు, పురాణాల విశ్లేషణలకి  సున్నితమైన హాస్యాన్ని మేళవించి ఆయన రాసే మాటల కోసమే ప్రేక్షకులు పదేపదే థియేటర్లకు వెళ్లేవారు కోకోల్లలు. "నువ్వు నాకు నచ్చావు", "మల్లీశ్వరి", "అతడు", "జల్సా", "ఖలేజా", "అత్తారింటికి దారేది" వంటి చిత్రాలు కేవలం కథలతోనే కాకుండా, ఆయన పదునైన సంభాషణల బలంతోనే ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి.

ఒక దశలో తెలుగు సినిమా చరిత్రలోనే కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి రచయితగా త్రివిక్రమ్ రికార్డు సృష్టించారంటే ఆయన మాటలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. "యుద్ధం గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం", "అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు", "ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు" లాంటి వందలాది డైలాగులు నేటికీ యువతరం సోషల్ మీడియా స్టేటస్‌లుగా, నిత్యజీవితంలో సామెతలుగా మారిపోయాయి. కథలో భారీ యాక్షన్ లేకపోయినా కేవలం తన మార్క్ డైలాగులు, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో బాక్సాఫీస్ వద్ద 100 శాతం సక్సెస్ కొట్టే సత్తా ఆయన సొంతం.

 

అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో, సగటు సినీ అభిమానుల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకప్పుడు మాటలతోనే సినిమాని  గెలిపించిన త్రివిక్రమ్ కలానికి ఇప్పుడు మునుపటి పదును తగ్గిందా అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆయన రూపొందించిన సినిమాలలో కమర్షియల్ హంగులు, స్టార్ హీరోల ఎలివేషన్లు ఎక్కువయ్యాయి తప్ప, గుండెను హత్తుకునే లోతైన సంభాషణలు కరువయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పాత సినిమాలను టీవీల్లో పదిసార్లు చూసినా బోర్ కొట్టని ఆ మ్యాజిక్, కొత్త సినిమాల విషయంలో ఎందుకు మిస్ అవుతోందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: జనరల్ బోగీలో హీరో విజయ్ ఆంటోనీ: ఎందులో తెలిస్తే సెల్యూట్ కొడతారు! 

ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత, భారీ బడ్జెట్, యాక్షన్ సీక్వెన్స్‌ల వైపు దర్శకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ కూడా తన సహజ శైలిని పక్కన పెట్టి, కమర్షియల్ ఫార్ములాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. గతంలో ఒక్క పంచ్ డైలాగ్‌తో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించి, ఆ వెంటనే ఒక చిన్న వాక్యంతో కంటతడి పెట్టించే ఆయన మార్క్ టచ్ ఇప్పుడు తగ్గిపోయిందని సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేయబోతున్న భారీ ప్రాజెక్ట్ "గాడ్ ఆఫ్ వార్" విషయంలోనైనా త్రివిక్రమ్ తన పాత శైలిని బయటకు తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భారీ యాక్షన్ సినిమాలు తీయడానికి ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నారు కానీ, అక్షరానికి హోదా తెచ్చి, మనుషుల మధ్య బంధాలను అందంగా చెప్పగల దర్శకుడు త్రివిక్రమ్ ఒక్కరేనని అభిమానులు గుర్తు చేస్తున్నారు. రాబోయే చిత్రాల్లోనైనా మాటల మాంత్రికుడు తన పెన్నుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చి, ఆడియన్స్‌ని  మంత్రముగ్ధులని చేస్తారో లేదో చూడాలి. చేయాలనీ కూడా కోరుకుందాం.

 

మీకు నచ్చవచ్చు: సినిమా సూపర్ బాబోయ్ సూపర్: మరి కలెక్షన్స్  ఎక్కడ!
మీకు నచ్చవచ్చు:సచిన్ టెండూల్కర్ కాబోయే అల్లుడు సినిమా హీరో: డీటెయిల్స్ ఇవే!

 

[Trivikram, Tollywood, pawan Kalyan, Ntr, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com