Home

»

Latest News

మహేష్ బాబు, అనిల్‌ రావిపూడి కాంబో రిపీట్‌.. అసలు ట్విస్ట్ ఏంటంటే.?

Nov 21, 2026 11:45AM

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న ఈ హిట్‌ జోడీ మళ్లీ కలిసి పనిచేయబోతోందనే సమాచారం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. అయితే ఈసారి వీరిద్దరూ కలుస్తున్నది సినిమా కోసం కాదు.. ఓ యాడ్‌ షూట్‌ కోసమట.

2020 సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు ఎనర్జీ, అనిల్‌ రావిపూడి మార్క్‌ కామెడీ, యాక్షన్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అప్పటినుంచి ఈ జోడీ రీయూనియన్‌పై అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ కమర్షియల్‌ యాడ్‌లో నటించబోతున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది చిన్న సర్‌ప్రైజ్‌ అనే చెప్పాలి. అయితే యాడ్‌ షూట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.

మహేష్ బాబు ప్రస్తుతం ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’తో బిజీగా ఉన్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఆయన పూర్తిగా సమయం కేటాయిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్‌ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.!

మరోవైపు అనిల్‌ రావిపూడి.. వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు.

మొత్తానికి మహేష్–అనిల్‌ కాంబినేషన్‌ మరోసారి కలుస్తున్నప్పటికీ అది వెండితెరపై కొత్త సినిమా కోసం కాదు. యాడ్‌ షూట్‌ వరకే పరిమితమవుతుందనే సమాచారం వినిపిస్తోంది. మరి ఈ హిట్‌ కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుంది? అభిమానుల ఎదురుచూపులకు ఎప్పుడు తెరపడుతుంది? అనేది చూడాలి.

మీకు నచ్చవచ్చు: 
వారణాసి వాయిదా.. బాల్ రాజమౌళి కోర్టులో లేదా.?
‘ఈ నగరానికి ఏమైంది 2’ బాక్సాఫీస్‌ రచ్చ.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే.?

 

 

 

[Mahesh Anil Combo, Mahesh Babu, Anil Ravipudi, Sarileru Neekevvaru, Varanasi]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com