ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో భారీ బడ్జెట్ ఫిల్మ్!
on Oct 4, 2023
జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమా 'దేవర'ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ ప్రాజెక్ట్ స్థానంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సి ఉంది. 'అరవింద సమేత' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో రెండో సినిమాగా 'NTR 30' ప్రకటన కూడా వచ్చింది. కానీ ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. అయితే వీరి కాంబోలో భవిష్యత్ లో ఖచ్చితంగా సినిమా ఉంటుందని, అది కూడా అత్యంత భారీస్థాయిలో ఉంటుందని గతంలో నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆయన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో హిట్ ఇచ్చాడు అనిపిస్తోంది.
'మ్యాడ్' మూవీ ప్రమోషన్స్ లో నాగవంశీ మాట్లాడుతూ.. ఒక భారీ బడ్జెట్ ఫిల్మ్ కోసం హీరోని, డైరెక్టర్ ని లాక్ చేశామని, ఈ ప్రాజెక్ట్ 2025 లో మొదలవుతుందని చెప్పాడు. అయితే పేర్లు మాత్రం ఇప్పుడే రివీల్ చేయలేనని అన్నాడు. గతంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ ప్రాజెక్ట్ ఉంటుందని నాగవంశీ అన్న మాటలు గుర్తు చేసుకుంటే.. 2025 లో మొదలుకానున్న ప్రాజెక్ట్ ఇదేనన్న సందేహం కలుగుతోంది.
ప్రస్తుతం 'దేవర'ను పూర్తి చేసే పనిలో ఉన్న ఎన్టీఆర్.. ఆ తర్వాత బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీ కానున్నాడు. అది పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే ప్రస్తుతం 'గుంటూరు కారం' చేస్తున్నాడు. అల్లు అర్జున్ తో ఓ ప్రాజెక్ట్ కమిటై ఉన్నాడు. అలాగే చిరంజీవితో ఓ సినిమా చేసే అవకాశముంది అంటున్నారు. ఇవన్నీ పూర్తి కావాలంటే నిజంగానే 2025 అవుతుంది. మరి అప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ తమ కాంబోలో రెండో ప్రాజెక్ట్ కోసం చేతులు కలుపుతారేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
