'రౌడీ అల్లుడు' లాంటి పక్కా కమర్షియల్ ఫిల్మ్ 'ధమాకా'
on Dec 18, 2022

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ధమాకా'. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది పక్కా కమర్షియల్ చిత్రమని, ఇందులో వింటేజ్ రవితేజ చూస్తారని త్రినాథరావు అంటున్నారు.
తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు త్రినాథరావు 'ధమాకా' చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "ఇది రవితేజ స్టైల్ లో ఉండే పక్కా కమర్షియల్ ఫిల్మ్. ఆయనతో ప్రయోగాలు చేయాలనుకోలేదు. ఈమధ్య ప్రేక్షకులు పాత రవితేజను మిస్ అవుతున్నారు. అందుకే ఆయనను ప్రేక్షకులు తెరపై ఎలా చూడాలనుకుంటున్నారో.. ఈ చిత్రంలో అలా చూపించాను. 'రౌడీ అల్లుడు' లాంటి సినిమా చేద్దామని చేసిన ప్రయత్నమే ఈ చిత్రం" అని త్రినాథరావు చెప్పుకొచ్చారు. ఆయన మాటలను బట్టి చూస్తే 'ధమాకా' చిత్రం మాస్ మహారాజా ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉండబోతుందని అర్థమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



