'ఆదిపురుష్' మళ్ళీ వాయిదా!
on Dec 18, 2022
.webp)
2023 జనవరిలో విడుదల కావాల్సిన 'ఆదిపురుష్' జూన్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం 2023 జూన్ లో కూడా విడుదల కావడం కష్టమేనని.. 2024కి వాయిదా పడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్న 'ఆదిపురుష్'కి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకుడు. కేవలం వంద రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మైథలాజికల్ ఫిల్మ్.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ టీజర్ లో వీఎఫ్ఎక్స్, పాత్రల గెటప్స్ పై విమర్శలు రావడంతో.. పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకా ఎక్కువ సమయం తీసుకొని మంచి ఔట్ పుట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో 2023 జూన్ 16కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఆ తేదికి ఇంకా ఆరు నెలలే ఉండటంతో.. అప్పటికి కూడా ఈ చిత్రం రెడీ అవ్వడం కష్టమేనని అంటున్నారు. వీఎఫ్ఎక్స్ కి ఎక్కువ సమయం తీసుకుంటున్నారని.. 2023 చివరిలో లేదా 2024 ప్రథమార్థంలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశముందని వినికిడి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



