వర్షాలతో థియేటర్లు ఖాళీ.. 'ది వారియర్' పరిస్థితేంటి?
on Jul 13, 2022

వారం రోజుల నుంచీ ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు నానా కష్టాలు పడుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో మరింత ఎక్కువగా వర్షాలు పడుతుండటంతో, పలు ప్రాంతాల్లో రెడ్, ఆరంజ్ అలెర్ట్ ప్రకటించారు. విక్రమ్ ఓటీటీకి వచ్చేయడంతో, థియేటర్లలో దాని ప్రభావం దాదాపు ముగిసింది. ఇక పోయినవారం విడుదలైన సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. 'హ్యాపీ బర్త్‌డే', 'గంధర్వ' సినిమాలకు మిక్స్‌డ్ టాక్ రావడంతో థియేటర్లకు వచ్చి వాటిని చూసే వారు కరువయ్యారు. దీనికి తోడు సోమవారం నుంచి వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో ప్రేక్షకులు లేక పలు షోలను రద్దు చేస్తూ వస్తున్నారు.
ఆడియెన్స్ లేకుండా షోలు వేసేకంటే థియేటర్లను మూసుకోవడం మంచిదని పలువురు ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు విడుదలవుతున్న రామ్ సినిమా 'ది వారియర్'పై అందరి దృష్టీ నిలుస్తోంది. ఎన్. లింగుసామి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఆన్‌లైన్ బుకింగ్ ఆశించిన రీతిలో లేదు. భారీ వర్షాల కారణంగానే టికెట్ సేల్స్ తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా మంచి బజ్ వచ్చిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా వస్తాయోననే ఆత్రుత వ్యక్తమవుతోంది. వర్షాల కారణంగా ఈ మూవీ ప్రి బిజినెస్ వాల్యూను సవరించి, కొంత తగ్గించినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఏదేమైనా వర్షాలు టాలీవుడ్ బిజినెస్‌పై పెద్ద దెబ్బే కొట్టాయని చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



