'యశోద' కోసం డూప్ లేకుండా ఫైట్లు చేసిన సమంత
on Jul 13, 2022

సమంత టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'యశోద'. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాతో దర్శక ద్వయం హరి శంకర్, హరీశ్ నారాయణ్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తమిళంలో తొలి స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్ 'అంబులి' (2012) తీసిన దర్శకులుగా వారు రికార్డులకెక్కారు. 'యశోద' కోసం బాగా పర్ఫామ్ చేయగలిగిన స్టార్ యాక్ట్రెస్ కావాలని అనుకున్నప్పుడు వారి మొట్టమొదటి ఛాయిస్ సమంత. అదృష్టవశాత్తూ, మొదటిసారి కలిసి కథ వినిపించిన వెంటనే ఆమె యస్ చెప్పేసింది.
"కథ చెప్పడం పూర్తయ్యాక, సమంత సరిగ్గా ఏమందంటే, 'నాకు గూస్‌బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమా చెయ్యాలనుకుంటున్నాను' అని. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' కంటే ముందుగానే మేం 'యశోద' కోసం సామ్‌ను సంప్రదించాం" అని వారు చెప్పారు. యాక్షన్ సీన్స్‌కు ఎవరి సాయమైనా తీసుకోవడానికి సామ్ తిరస్కరించిందని కూడా హరి-హరీశ్ చెప్పారు.
"యాక్షన్ సీక్వెన్స్‌లలో ఎక్కువ భాగం సెట్స్‌లోనే తీశాం. ఫైట్ సీక్వెన్స్ అన్నీ తానే స్వయంగా చేయాలనుకున్న ఆమె, అవి తీసే ముందు రెండు మూడు రోజులు రిహార్సల్స్ చేసేది. బాడీ డబుల్ (డూప్)కు ఆమె ఏమాత్రం ఒప్పుకోలేదు. కొన్ని సీన్లలో సేఫ్టీ కోసం రోప్ అవసరమైనప్పుడు, వాటిని కూడా ఆమే స్వయంగా చేసింది. అవి చేసేటప్పుడు తను బాగా ఎంజాయ్ చేసింది కూడా" అని వారు వెల్లడించారు. 'యశోద'లో యాక్షన్ సీన్లను హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్, టాలీవుడ్‌కు చెందిన వెంకట్ మాస్టర్ డిజైన్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



