‘సుగుణ సుందరి’తో బాలయ్య చిందులు!
on Dec 14, 2022

గాడ్ అఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బులెట్ కన్నా వేగంగా దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' చేస్తున్నారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఓ పాట విడుదలవ్వగా.. ఇక రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 'వీరసింహారెడ్డి' సెకండ్ సింగిల్ సుగుణ సుందరిని డిసెంబర్ 15న విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు లిరికల్ వీడియో పాటను లాంచ్ చేయడానికి టైం ని లాక్ చేసారు. సుగుణ సుందరి ఉదయం 9:42 గంటలకు విడుదల కానుంది. ఓ లవ్లీ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ ప్రకటన చేశారు.
పోస్టర్‌లో బాలకృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించగా శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. ఈ డ్యూయట్ లో లీడ్ పెయిర్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించబోతున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రం కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించిన్నట్లు సమాచారం. ఫస్ట్ సింగిల్ జై బాలయ్యకు అద్భుతమైన స్పందన వచ్చింది. అద్భుతమైన ఆదరణ పొందిన మొదటి పాట 'జై బాలయ్య' మాస్ నంబర్ అయితే, సుగుణ సుందరి డ్యూయెట్. భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ కూడా సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్ మెటీరియల్ అంచనాలను పెంచుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



