భారీస్థాయిలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్!
on Dec 14, 2022

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో అలరించనున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా 2023, జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీస్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
'వాల్తేరు వీరయ్య' వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో నిర్వహించనున్నారట. జనవరి 8న జరగనున్న ఈ ఈవెంట్ కి.. తెలంగాణ అభిమానుల కోసం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
అప్పట్లో అత్యధిక మంది హాజరైన ఆడియో ఫంక్షన్ గా 'ఆంధ్రావాలా'(2004) రికార్డు సృష్టించింది. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జరిగిన ఆ వేడుక కోసం అప్పుడు ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయగా.. లక్షల్లో జనాభా హాజరయ్యారు. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' ఈవెంట్ కోసం మేకర్స్ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



