మా ప్రాణాలకు ముప్పు ఉంది.. భద్రత కల్పించండి.. రియా అభ్యర్థన!
on Aug 27, 2020

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులను ఇప్పటికి పలుమార్లు సీబీఐ, ఈడీ, ఇతర దర్యాప్తు అధికారులు విచారించారు. తాజాగా ఒక స్టేట్‌మెంట్ కోసం తన తండ్రిని మీడియా గుంపుగా ఎలా ఇబ్బంది పెడుతోందో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో ద్వారా షేర్ చేసింది.
"ఇది మా బిల్డింగ్ కాంపౌండ్ లోనిది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మా నాన్న ఇంద్రజిత్ చక్రవర్తి (రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్). ఈడీ, సీబీ, పలు దర్యాప్తు సంస్థలకు సహకరించడానికి మా ఇంట్లోంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. నా ప్రాణాలకూ, నా కుటుంబం ప్రాణాలకూ ముప్పు ఉంది. లోకల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా, ఆఖరికి అక్కడకు వెళ్లినా, ఎలాంటి సాయం అందించలేదు. పోలీసు రక్షణ కోసం దర్యాప్తు సంస్థలకు సమాచారమిచ్చినా, సాయం లభించలేదు. ఈ ఫ్యామిలీ బతికేదెట్లా? మమ్మల్ని సహకరించమని అడుగుతున్న వివిధ సంస్థలకు సహకరించడానికే మేం రక్షణ కోరుతున్నాం. దయచేసి ముంబై పోలీసులు మాకు భద్రత కల్పించాలని కోరుతున్నా, అప్పుడు మేం దర్యాప్తు సంస్థలకు సహకరించగలం. కొవిడ్ రోజుల్లో, ఈ ప్రాథమిక శాంతి భద్రతల నిబంధనలు కల్పించాల్సిన అవసరం ఉంది. థాంక్యూ" అని రాసుకొచ్చింది రియా.
సుశాంత్ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. గురువారం నాటికి రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ ఫ్లాట్‌మేట్ సిద్ధార్థ్ పితాని, వంటమనిషి నీరజ్, రజత్ మేవతి, బిల్డింగ్ వాచ్‌మన్ కేశవ్‌లను సీబీఐ ప్రశ్నించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



