'ఆచార్య' కథ కొరటాలదే... నిర్మాణ సంస్థ ప్రకటన!
on Aug 27, 2020

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'ఆచార్య'. దీనికి కొరటాల శివ దర్శకుడు. ఆయనే కథారచయిత. అయితే, గతంలో పలువురు దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన రాజేష్ మండూరి 'ఆచార్య' కథ తనదేనని మీడియాకి ఎక్కారు. నటసింహం నందమూరి బాలకృష్ణ కోసమే ఈ కథ రాసుకున్నానని ఆయన తెలిపారు. గతంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు కథ వినిపించాననీ చెప్పారు. దాంతో పరిశ్రమ వర్గాలలో చర్చ మొదలైంది. సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ వివాదంపై ఆచార్య నిర్మాణ సంస్థ మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. కథ కొరటాల శివదేనని క్లారిటీ ఇచ్చింది.
.jpg)
"కొరటాల శివ రాసిన ఒరిజినల్ స్టోరీ 'ఆచార్య'. ఆయన ఒక్కరే కాన్సెప్ట్ విజువలైజేషన్ ఊహించుకున్నారు. కథ విషయంలో వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవి. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి గ్రేట్ రెస్పాన్స్ అందుకుంది. ఆ హైప్ చూసి కొందరు రచయితలు తప్పుడు ఆరోపణలతో కథ తమదేనంటూ వస్తున్నారు. 'ఆచార్య' కథను మేం కాన్ఫిడెన్షియల్ గా ఉంచాం. అతి కొద్దిమందికి మాత్రమే ఈ కథ తెలుసు. కొరటాల శివ వంటి పేరున్న దర్శకుడు గౌరవానికి భంగం కలిగించడానికి కొందరు ఆరోపణలు చేస్తున్నారు" అని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



