'బిగ్ బాస్'కి కరోనాతో కొత్త కష్టాలు
on Aug 27, 2020

సెప్టెంబర్ మొదటివారం నుండి స్టార్ మా ఛానల్‌లో 'బిగ్ బాస్' సీజన్ 4 స్టార్ట్ అవ్వడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. కానీ, కంటెస్టెంట్లు ఎవరు అనేది కంప్లీట్ లిస్ట్ ఖరారు కాలేదట. చివరి నిమిషం వరకూ హౌస్ లోకి ఎవరిని పంపించేదీ స్టార్ మా యాజమాన్యం గుట్టుగా ఉంచుతుంది. అయితే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. కొంతమందిని సెలెక్ట్ చేసుకుని అందులో కొంతమందిని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారు. కరోనా కారణంగా ఈసారి కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసే విషయంలో చిన్న చిన్న సమస్యలు పెద్దవి అవుతున్నట్టు భోగట్టా.
హౌస్ లోపలికి పంపించే కంటెస్టెంట్లను కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు, లోపలికి పంపే ముందు టెస్టులు చేయిస్తే చాలని ప్లాన్ చేశారు. ప్రజెంట్ క్వారంటైన్‌లో ఉన్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులకు కరోనా రావడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. మళ్ళీ వ్యవహారం మొదటికి వస్తోంది. ఆ స్థానంలో ఇంకొకరిని ఇప్పటికి ఇప్పుడు ఎంటర్ చేయడం కుదరదని పని. పదిహేను రోజుల క్వారంటైన్, టెస్ట్ వంటివి కంప్లీట్ కావడానికి టైమ్ పడుతుంది. అందుకని, తరవాత సర్‌ప్రైజ్ ఎంట్రీలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



