"ఇది నీ కోసమే చిరు".. మళ్లీ నటిస్తున్నట్లు అనౌన్స్ చేసిన మేఘన!
on Oct 19, 2021

సినిమాల్లోకి తిరిగి అడుగుపెడుతున్నట్లు నటి మేఘనా రాజ్ ప్రకటించారు. భర్త దివంగత చిరంజీవి సర్జా జయంతి సందర్భంగా ఆమె ఈ కీలక ప్రకటన చేశారు. చిరుకు క్లోజ్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ పన్నగ భరణ నిర్మించే ఒక థ్రిల్లర్‌లో ఆమె నటించనుంది. ఈ మూవీ ద్వారా విశాల్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీకి మేఘన సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఈ న్యూస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన మేఘన, "ఈరోజు కంటే మంచి రోజు ఇంకోటి లేదు, ఈ టీమ్ కంటే మరో మంచి టీమ్ లేదు. ఇది నీ బర్త్‌డే, ఇది మన డ్రీమ్.. ఇది నీ కోసమే చిరు! పన్న (పన్నగ భరణ) కాకపోతే, దీని గురించి కనీసం నేను ఆలోచించకపోదును. నిజంగా ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నట్లుగా ఉంది. Its OFFICIAL… CAMERA… ROLLING… ACTION! (sic).” అని రాసుకొచ్చారు.
మేఘన కమ్‌బ్యాక్ ఫిల్మ్‌ను ఎనౌన్స్ చేస్తూ, నిర్మాత పన్నగ భరణ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో హృదయాన్ని స్పృశించే ఒక నోట్‌ను షేర్ చేశాడు. "డియర్ చిరు.. మన కలల్లో ఒకటైన ఒక సినిమాని నిర్మించడమనే కానుకను నీ జయంతి రోజున అందిస్తున్నాను. ఈ ఫిల్మ్‌లో మేఘన హీరోయిన్‌గా నటిస్తుండటం ఈ జర్నీ మరింత అర్థవంతంగా ఉంటుందనుకుంటున్నాను. అందరూ సానుకూలంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది సాధ్యపడటం వెనుక ఉన్న శక్తివి నువ్వే. సెలబ్రేట్ చేసుకోవడానికి ఎప్పటికీ మా కారణం నువ్వే." అని ఆయన రాసుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



