నా సోదరుడు అఖిల్ అంటూ రామ్ చరణ్ ప్రశంసలు!
on Oct 19, 2021

అక్కినేని అఖిల్ తను హీరోగా నటించిన నాలుగో సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆయన నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాకు, సినిమాలో అఖిల్ నటనకు వస్తున్న రెస్పాన్స్ పట్ల అక్కినేని అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించాడు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాపై రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "నా సోదరుడు అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' విజయం సాధించడం సంతోషంగా ఉంది. అఖిల్ నటన నచ్చింది. పూజాహెగ్డే మరోసారి అదరగొట్టింది. మూవీ టీమ్ కి అభినందనలు. మూవీ చూసి బాగా ఎంజాయ్ చేశాం" అని చరణ్ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే వైజాగ్ లో థాంక్స్ మీట్ నిర్వహించిన మూవీ టీమ్.. నేడు(మంగళవారం) హైదరాబాద్ లో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



