'మా'లో ఉన్నవాళ్లంతా జోకర్లయితే మీరు రింగ్ మాస్టర్.. ఆర్జీవీకి మనోజ్ రిప్లై!
on Oct 19, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత వివాదాస్పదమయ్యాయో, అంత హాస్యాస్పదంగా మారాయి కూడా. ఈ ఎన్నికల కారణంగా యాక్టర్స్ రెండు వర్గాలుగా చీలిపోయారన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. అందుకు అనుగుణంగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తనదైన తరహాలో చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో కాక పుట్టించింది. 'మా' అనేది జోకర్స్‌తో నిండిపోయిన సర్కస్‌లా ఉందని ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. "Cine'MAA' is a CIRCUS full of JOKERS," అని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆయన కామెంట్ చేశారు. అంతకు ముందు కూడా ఆయన "సినిమా జనం తాము నిజానికి ఒక సర్కస్ అని ఆడియెన్స్‌కు ప్రూవ్ చేశారు" అని రాశారు.
ఆర్జీవీ ట్వీట్‌కు హీరో మంచు మనోజ్ స్పందించాడు. ఆ సర్కస్‌కు మీరే రింగ్‌మాస్టర్ అవుతారని జవాబిచ్చాడు. ఆర్జీవీ ట్వీట్‌ను రిట్వీట్ చేసిన మనోజ్, దానికి "And you are the Ring Master sir" అనే కామెంట్ పెట్టాడు. అంటే ఆ సర్కస్‌ను మీరే ఆడిస్తున్నారు అనే అర్థం వచ్చేలా ఆ కామెంట్ పెట్టాడన్న మాట.
మోహన్‌బాబు కుటుంబంతో ఆర్జీవికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఒక్క మనోజ్‌ను మినహాయిస్తే, ఆ కుటుంబంలోని మిగతా ముగ్గురు యాక్టర్లు.. మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మిలతో ఆర్జీవీ సినిమాలు రూపొందించిన విషయం తెలిసిందే.
'మా' ఎన్నికల్లో విష్ణు ప్రెసిడెంట్‌గా గెలిచి, అతని ప్యానల్ సభ్యులు ఎక్కువమంది గెలుపొందిన దగ్గర్నుంచీ ప్రకాశ్‌రాజ్ చేస్తున్న గొడవ అంతా ఇంతా కాదు. రోజూ ఏదో ఒక అంశాన్ని లేవదీస్తూ, 'మా' ఎన్నికలను సాధ్యమైనంత వివాదాస్పదం చేయడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే జోకర్స్‌తో నిండిపోయిన సర్కస్‌లా 'మా' కనిపిస్తోందని కామెంట్ చేశాడు వర్మ.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
