Home

»

Latest News

ఈ న‌లుగురి టార్గెట్.. డ‌బుల్ హ్యాట్రిక్!

Jan 26, 2022 5:10PM

ప్ర‌స్తుతం తెలుగునాట కొంద‌రు ప్ర‌ముఖులు `డ‌బుల్ హ్యాట్రిక్`ని టార్గెట్ చేసుకున్నారు. ఇప్ప‌టికే ఐదు వ‌రుస విజ‌యాలు అందుకుని.. ఆరో హిట్ కోసం చూస్తున్న ఆ ప్ర‌ముఖుల వివ‌రాల్లోకి వెళితే..

విక్ట‌రీ వెంక‌టేశ్:  `గురు`, `ఎఫ్ 2`, `వెంకిమామ‌`, `నార‌ప్ప‌`, `దృశ్యం 2`.. ఇలా రీసెంట్ టైమ్స్ లో వ‌రుస‌గా ఐదు విజ‌యాల‌తో వార్త‌ల్లో నిలిచారు సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉన్న `ఎఫ్ 3`తో డ‌బుల్ హ్యాట్రిక్ పై క‌న్నేశారు వెంకీ. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 28న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్ రిలీజ్ కానుంది.

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్: `టెంప‌ర్`, `నాన్న‌కు ప్రేమ‌తో`, `జ‌న‌తా గ్యారేజ్`, `జై ల‌వ కుశ‌`, `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` రూపంలో బ్యాక్ టు బ్యాక్ ఐదు హిట్స్ చూశారు నంద‌మూరి స్టార్ ఎన్టీఆర్. మార్చి 18న లేదా ఏప్రిల్ 28న థియేట‌ర్స్ లోకి రాబోతున్న `ఆర్ ఆర్ ఆర్`తో డ‌బుల్ హ్యాట్రిక్ ని టార్గెట్ చేసుకున్నారు తార‌క్.

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే:  `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`, `మ‌హ‌ర్షి`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్`, `అల వైకుంఠ‌పుర‌ములో`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` సినిమాల‌తో తెలుగునాట ఐదు వ‌రుస విజ‌యాలు అందుకుంది పూజా హెగ్డే. ఏప్రిల్ 1న విడుద‌ల‌కు సిద్ధ‌మైన `ఆచార్య‌`తో డ‌బుల్ హ్యాట్రిక్ ని టార్గెట్ చేసుకుందీ బుట్ట‌బొమ్మ‌.

స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి:  `ప‌టాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. ఇలా కెరీర్ ఆరంభం నుంచి విజ‌యాల‌తోనే ముందుకు సాగుతున్న అనిల్ రావిపూడి.. రాబోయే చిత్రం `ఎఫ్ 3`తో డ‌బుల్ హ్యాట్రిక్ ని టార్గెట్ చేసుకున్నాడు.  ఏప్రిల్ 28న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.

మ‌రి.. వీరిలో ఎవ‌రెవ‌రు డ‌బుల్ హ్యాట్రిక్ అందుకుంటారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com