మిడిల్ క్లాస్ తండ్రికి తెలియకుండానే ఆడిషన్స్ చేశారట!
on Nov 24, 2020

'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాలో హీరో విజయ్ దేవరకొండ కంటే అతడి తండ్రిగా నటించిన గోపరాజు రమణకు ఎక్కువ పేరు వచ్చింది. కొండలరావు పాత్రలో ఆవేశపరుడుగా అతడు అద్భుత అభినయం ప్రదర్శించారని ప్రేక్షక లోకం అంతా ముక్తకంఠంతో అభినందిస్తూ ఉంది. అతడు ఎవరో, తండ్రి పాత్రకు అతడిని ఎలా ఎంపిక చేశారో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు.
గోపరాజు రమణకు 'మిడిల్ క్లాస్ మెలోడీస్' తొలి సినిమా అని చెప్పవచ్చు. అయితే అతడికి నటన కొత్త కాదు. స్టేజి మీద చాలా సార్లు నటించారు. ఆయన రంగస్థల నటుడు. ఆనంద్ దేవరకొండ తండ్రి పాత్రకు దర్శకుడు వినోద్ అనంతోజు పలువురు నటులను అనుకుంటున్న సమయంలో.. రవీంద్ర భారతిలో నాటకాలు ప్రదర్శిస్తున్నారని ఒకసారి అక్కడికి వెళ్లిరమ్మని దర్శకుడికి 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి చెప్పారు. రవీంద్ర భారతికి వెళ్ళిన వినోద్ అనంతోజుకి ఓ నాటకంలో గోపరాజు రమణ నటన విపరీతంగా నచ్చేసింది. తమ సినిమాలో తండ్రి పాత్ర చేయమని అడిగితే నో చెప్పారట.
గోపరాజు రమణకు తెలియకుండానే ఆడిషన్స్ చేసి రెండు, మూడు డైలాగులు చెప్పించుకుని తమ సినిమాలో కొండలరావు అతడే అని వినోద్ అనంతోజు ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన్ను కన్విన్స్ చేశారట. తండ్రి పాత్ర ఎంపిక వెనుక అంత కథ నడిచింది. హీరో తల్లి సురభి ప్రభావతి, హీరోయిన్ తల్లిదండ్రులు ప్రేమ్ సాగర్, ప్రభావతిది కూడా రంగస్థల నేపథ్యమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



