తండ్రీకొడుకులుగా పవన్?
on Nov 24, 2020

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. అది కూడా తండ్రీకొడుకుల పాత్రల్లో. ఆ వివరాల్లోకి వెళితే.. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో పవన్ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ వెంచర్ కోసమే తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారట పవన్. అయితే తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లోనే కనిపిస్తుందని టాక్. త్వరలోనే పవన్ డ్యూయెల్ రోల్ పై క్లారిటీ వస్తుంది.
ఇదివరకు తీన్ మార్ చిత్రంలోనూ పవన్ ద్విపాత్రాభినయం చేశారు. అందులో కూడా రెండు వేర్వేరు కాలాలకి చెందిన రెండు విభిన్న పాత్రల్లో సందడి చేశారు ఈ కొణిదెల స్టార్. కాకపోతే, ఆ పాత్రల మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. వినోదంతో పాటు సామాజిక సందేశం మేళవిస్తూ హరీష్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా.. వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది. గబ్బర్ సింగ్ కి బాణీలను అందించిన దేవిశ్రీ ప్రసాద్ నే ఈ మూవీకి కూడా సంగీతమందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



