'థాంక్యూ' ఓటీటీలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.. పీసీ శ్రీరామ్ భావోద్వేగం!
on Jul 27, 2022

నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన 'థాంక్యూ' మూవీ జూలై 22న విడుదలైంది. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇటు చైతూ, అటు విక్రమ్ కుమార్ కెరీర్లలో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీకి గొప్ప గొప్ప టెక్నీషియన్లు పనిచేశారు. ఇటీవలే నేషనల్ అవార్డ్ గెలుచుకున్న తమన్ సంగీతం సమకూరిస్తే, ఇదివరకే నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన పీసీ శ్రీరామ్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు.
'థాంక్యూ' మూవీలోని ప్లస్ పాయింట్స్‌లో సినిమాటోగ్రఫీ ఒకటని విమర్శకులు మెచ్చుకున్నారు. నిజంగానే పలు సన్నివేశాల్లో పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం గొప్పగా కనిపించింది. మంచులో అమెరికా అందాలను ఆయన కెమెరా అద్భుతంగా కాప్చర్ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని నారాయణపురం గ్రామ అందాలు కూడా ఆయన కెమెరా పనితనానికి మెచ్చుతునక.
'థాంక్యూ' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిన విషయాన్ని అంగీకరిస్తూనే, ఇంతటితో 'థాంక్యూ' జర్నీ ఆగినట్లు కాదనీ, ఓటీటీలో దాని జర్నీ ఉంటుందనీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ద్వారా వెల్లడించారు. జనం ఓటీటీ మైండ్‌సెట్‌లోకి వెళ్లారనీ, అందుకనే థియేటర్లలో జనం కనిపించడం లేదనే అభిప్రాయం కలిగేలా ఒక భావోద్వేగంతో తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
"ఇది హిట్ లేదా ఫెయిల్యూర్ గురించి కాదు. OTT మైండ్ సెట్ మనలోకి ప్రవేశించింది, థాంక్యూ అనే పదం OTTలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. విమర్శలు గౌరవించబడతాయి, అంగీకరించబడతాయి, OTT అనేది ప్రపంచవ్యాప్తం కాబట్టి, 3 రెట్లు ఎక్కువ చెల్లించాలి. అది చాలా పెద్దది. థాంక్యూ కానీ నో థాంక్యూ ఇప్పటికీ థాంక్యూ. #ThankYouTheMovie " అని ఆయన ట్వీట్ చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



