నేను బావిలో కప్పలాంటోడిని!
on Jul 27, 2022

వేణు తొట్టెంపూడి అనగానే అతను చేసిన మల్టీ స్టారర్ మూవీస్ గుర్తొస్తాయి. సోషల్ మీడియా అంతగా ఆక్టివ్ గా లేని రోజుల్లోనే ఆయన ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. వేణు చేసిన ఫామిలీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఎంతో మంది లేడీ ఫాన్స్ కూడా ఉండేవారు. ఐతే రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారని ఒక ఇంటర్వ్యూలో అడిగేసరికి "రెండూ వేర్వేరు పార్శ్వాలు.. దేన్నీ కూడా దేంతో కలపలేం. నేను మూవీస్ అని, షూటింగ్స్ అని, ప్రమోషన్స్ అని బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంది నా వైఫ్. ఆ క్రెడిట్ అంతా తనదే" అని చెప్పారు.
అలాగే తనకు ఒక పాప, ఒక బాబు ఉన్నారని చెప్పారు. పాప 12th గ్రేడ్, బాబు 10th గ్రేడ్ అని చెప్పారు వేణు. "వేణు మళ్ళీ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతారని అనుకోవచ్చా?" అనే ప్రశ్నకు "నో క్లూ" అని సమాధానమిచ్చారు. "వేణు గారు ఇంత హైట్ గా అందంగా ఉంటారు కదా.. మూవీ ప్రమోషన్స్ కి వెళ్తూ ఉంటారు కదా.. ఆ టైంలో మీకు ఎన్ని ప్రొపోజల్స్ వచ్చాయి?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు "నాకు బయటి ప్రపంచం అసలు తేలీదు. నేనెప్పుడూ బావిలో కప్పలా ఉండే వాడిని" అని చెప్పారు.
ఇలా ఉంటే బిజినెస్ లో ఎలా సక్సెస్ అయ్యారు? అని అడిగితే, అలా ఉండడం నేర్చుకున్నాను అనేది వేణు జవాబు. "ప్రపోజల్స్ విషయం తెలీదు కానీ నేను ఎక్కడికైనా వెళ్లాను అంటే మాత్రం అక్కడ కొంతమంది వయసులో పెద్దగా ఉండే ఆడవాళ్లు 'బాబు నీకు పెళ్లయిందా?' అని మాత్రం తప్పనిసరిగా అడుగుతారు. 'పెళ్లయ్యింది, ఇద్దరు పిల్లలు' అని చెప్పేస్తాను వాళ్లకు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు నాకు నవ్వొస్తుంది. అందుకే నేను వాళ్ల ప్రశ్నలను కాంప్లిమెంట్ గా తీసుకుంటాను. వేణు లాంటి మంచి కుర్రాడు అల్లుడిగా వస్తే బాగుండేమో అని అనుకుంటూ ఉంటారేమో" అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు వేణు.
"రామారావు ఆన్ డ్యూటీ మూవీ చేశారు కాబట్టి ఇకనుంచి ఇండస్ట్రీ నుంచి ఎన్నో మంచి ఆఫర్స్ వస్తాయా?" అని అడిగితే, "ఏమో అంతవరకు తెలీదు. దేవుడి దయ వల్ల మంచి అవకాశాలు వస్తే చేస్తాను.. ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతాను." అన్నారు. "ఆర్టిస్ట్ గా, బిజినెస్‌మేన్ గానే కాకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా?" అనే ప్రశ్నకు "ప్రస్తుతానికి మంచి ఆర్టిస్ట్ గా ఉండాలని అనుకుంటున్నా" అని చెప్పారు వేణు. 'హనుమాన్ జంక్షన్' మూవీలోంచి ఒక డైలాగ్ చెప్పారు. "జీవితం ఏది ఇస్తే అది తీసుకో.. ఏముంటే దాన్నే ఎంజాయ్ చెయ్" అంటూ జీవిత సత్యాలను చెప్పారు వేణు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



