అమ్మానాన్నలతో 'అఖండ'ను థియేటర్‌లో చూసిన ప్రగ్యా!
on Dec 3, 2021

నటి ప్రగ్యా జైస్వాల్ మేఘాల్లో విహరిస్తోంది. బాలకృష్ణ సరసన ఆమె హీరోయిన్‌గా నటించిన 'అఖండ' సినిమా రోరింగ్ బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతుండటమే దీనికి కారణం. కెరీర్ పరంగా ప్రగ్య పరిస్థితి అంత ఆశాజనకంగా లేని టైమ్‌లో 'అఖండ'లో అనంతపురం కలెక్టర్ శరణ్య బాచుపల్లి పాత్రను పోషించే అవకాశం అనూహ్యంగా ఆమెకు లభించింది. అనేకమంది తారలను పరిశీలించి, వారిలో కొంతమందిని సంప్రదించి, అవేవీ వర్కవుట్ కాకపోవడంతో చివరి నిమిషంలో పగ్యాను హీరోయిన్‌గా ఎంచుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకొని శరణ్య పాత్రలో సూపర్బ్‌గా రాణించింది ప్రగ్య. ఒకవైపు గ్లామర్‌తో అలరిస్తూ, మరోవైపు పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుందామె.
'అఖండ' విడుదలైన గురువారంనాడే తన తల్లితండ్రులతో థియేటర్‌లో సినిమాను చూసి, ఆనందంలో తలమునకలైంది ప్రగ్యా. ఈ సందర్భంగా థియేటర్ దగ్గర వారితో కలిసి దిగిన ఫొటోను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసి, "ఈరోజు నా ఫ్యామిలీతో సినిమా చూశాను. రోరింగ్ రెస్పాన్స్‌కు థాంక్యూ. మీ ప్రేమకు కృతజ్ఞురాలిని." అని రాసుకొచ్చి, #Akhanda #AkhandaFromToday అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను జోడించింది.
Also read: బాలయ్య 'అఖండ' విజయం.. మహేష్ బాబు ఫుల్ హ్యాపీ!
కాగా, తొలిరోజు 'అఖండ' బాలకృష్ణ కెరీర్‌లో అత్యధికంగా రూ. 15.39 కోట్ల షేర్‌ను సాధించి, బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



