Home

»

Latest News

తెలుగు రాష్ట్రాల్లో 'అఖండ' జాత‌ర‌.. అంచ‌నాల‌ను మించిన ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్‌!

Dec 03, 2021

 

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'అఖండ' మూవీ విడుద‌లైన మొద‌టి రోజు అంచ‌నాల‌ను మించి అమోఘంగా ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందుతోంది. "నా గ‌మ్యం, గ‌మ‌నం శివాధీనం" అంటూ అఖండ చెప్తున్న డైలాగ్స్‌కు ఫ్యాన్స్ శివాలెత్తిపోతున్నారు. ట్రేడ్ వ‌ర్గాలు అందిస్తున్న స‌మాచారం మేర‌కు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే రూ. 15.39 కోట్ల షేర్‌తో 'అఖండ' ప్ర‌భంజ‌నం స్టార్ట‌యింది. బాల‌కృష్ణ కెరీర్‌లోనే ఫ‌స్ట్ డే ప‌రంగా ఇదే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్‌. బాల‌య్య - బోయ‌పాటి కాంబో అంటే మాస్ జాత‌ర‌ ఉంటుందో మ‌రోసారి ఈ సినిమా మ‌న‌కు చూపిస్తోంది.

డిసెంబ‌ర్ 2న బీభ‌త్స‌మైన హైప్‌తో ఆడియెన్స్ ముందుకు వ‌చ్చిన 'అఖండ' మూవీ, అంత‌కు మించి బీభీత్స‌మైన క‌లెక్ష‌న్ల‌ను తొలిరోజు రాబ‌ట్టింది. తెలంగాణ రీజియ‌న్‌లో రూ. 4.39 కోట్ల షేర్‌ను సాధించిన ఈ ఫిల్మ్ ఆంధ్రాలో రూ. 6.98 కోట్లు, రాయ‌ల‌సీమ ప్రాంతంలో రూ. 4.02 కోట్ల షేర్‌ను సాధించ‌డం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టిక్కెట్ ధ‌ర‌లు త‌క్కువైన‌ప్ప‌టికీ అక్క‌డ, తొలిరోజు రూ. 11 కోట్ల షేర్ రావ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ అంశం. 

2021లో విడుద‌లైన సినిమాల్లో ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల ప‌రంగా 'అఖండ' రెండో స్థానంలో నిలిచింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ 'వ‌కీల్ సాబ్' మూవీ ఫ‌స్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ డే రూ. 32.24 కోట్ల షేర్‌తో తొలి స్థానంలో ఉంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com