ఒక్క పాటను వందసార్లు చూసిన తమన్!
on Dec 28, 2019

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ 'అల.. వైకుంఠపురములో' పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగిస్తున్న విషయం మనకు తెలుసు. తమన్ స్వరాలు కూర్చిన ఈ పాటల్లో 'సామజవరగమన', 'రాములో రాములా'.. ఒక దాన్ని మించి మరొకటి యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన టాలీవుడ్ సాంగ్స్‌గా రికార్డులకెక్కాయి. ఆ రెండింటితో పోల్చుకుంటే 'ఓ మైగాడ్ డాడీ', 'బుట్టబొమ్మ' సాంగ్స్ వైరల్ కాలేదు. అయితే, 'ఓ మైగాడ్ డాడీ' సాంగ్ చిత్రీకరణపరంగా 'అద్భుతహ'గా ఉందని తమన్ అసాధారణ స్థాయిలో ఎగ్జైట్ అవుతున్నాడు. అవును. అసాధారణ స్థాయిలోనే! ఇప్పటికే అతను ఆ సాంగ్‌ను అక్షరాలా 100 టైమ్స్ చూశాడంట!
"ఇంతదాకా 99 సార్లు చూశాను. ఇప్పుడు వందోసారి చూసేందుకు వెళ్తున్నా. వాట్ యాన్ హై! థియేటర్‌లో పూనకాలకు మించి.. నా ప్రామిస్.. మైండ్ బ్లోన్ ఓ మైగాడ్ డాడీ" అని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు తమన్. ఎప్పుడో నవంబర్ 22న రిలీజ్ చేసిన ఈ సాంగ్ లిరికల్ వీడియోకు కేవలం 12 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ సాంగ్‌కు హైప్ తీసుకొచ్చే బాధ్యతను తమన్ భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోందనీ, అందుకే దాన్ని వందోసారి చూసేందుకు వెళ్తున్నాననీ, ఆ పాటకు థియేటర్‌లో పూనకాలు వస్తాయనీ ఊదరగొడుతున్నాడనీ ఫిలింనగర్ వాసులు అంటున్నారు. వాళ్ల మాటలు ఎలా ఉన్నా తమన్ అలా చెప్తున్నాడంటే, కచ్చితంగా ఆ సాంగ్‌ను ఆ రేంజిలో కొరియోగ్రాఫర్ గణేశ్ తీశాడని అనుకోవచ్చు. దానికి పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ తోడై సూపర్‌గా వచ్చి ఉంటుందనుకోవాలి. కృష్ణచైతన్య రాసిన ఈ పాటను రోల్ రైడా, రాహుల్ నంబియార్, లేడీ కాష్, రాహుల్ సిప్లిగంజ్, బ్లాజీ పాడారు. ఈ మూవీలో బన్నీ డాడీగా మురళీశర్మ కనిపించనున్నాడు. తమన్ చెప్పినట్లు 'ఓ మైగాడ్ డాడీ' సాంగ్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలకు మించి ఏం తెప్పిస్తుందో చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



