'భీష్మ'ను మెచ్చిన హృతిక్!
on Dec 28, 2019
నితిన్, రష్మికా మందన్న జంటగా నటిస్తోన్న 'భీష్మ' సినిమాకు అనుకోని వ్యక్తి నుంచి, అనూహ్యమైన ప్రశంస దక్కింది. ఆ వ్యక్తి.. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్! అవును. దానికీ ఓ కారణం ఉంది. హృతిక్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన 2019 బాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ 'వార్'లో సూపర్ హిట్ సాంగ్ 'యే ఘుంగ్రూ టూట్ గయే'ను ఇటలీలోని పొసిటానోలో హృతిక్, వాణీ కపూర్, డాన్సర్లపై చిత్రీకరించారు. అదే ప్లేస్‌కు ఓ పాట నిమిత్తం 'భీష్మ' బృందం వెళ్లింది. ఎక్కడైతే 'ఘుంగ్రూ' పాటను తీశారో, సరిగ్గా అక్కడే ఆ పాటకు నితిన్, రష్మిక డాన్స్ చేశారు. ఇది ఆన్లైన్లో వైరల్ అయ్యింది. హృతిక్కూ చేరింది. దాంతో ప్లీజ్ అయిన హృతిక "స్వీట్. థాంక్యూ సో మచ్ రష్మిక అండ్ నితిన్. 'భీష్మ'కు శుభాకాంక్షలు. లవ్ యు గైస్' అని తన ట్విట్టర్ పేజీలో ప్రశంసించాడు.
ఇంతకంటే 'భీష్మ' యూనిట్‌కు ఆందందకరమైన విషయం ఇంకేముంటుంది! హృతిక్ ట్వీట్‌కు రెస్పాండ్ అయ్యింది రష్మిక. "మీరు శుభాకాంక్షలు తెలిపినందుకు థాంక్యూ సర్. అవి మాకు చాలా విలువైనవి. ఒకనాటికి మేము మిమ్మల్ని కలుసుకుంటామనీ, ఆ సీక్వెన్స్‌ను (సాంగ్ స్టెప్స్) మీతో చేస్తామని ఆశిస్తున్నాను. దట్ విల్ బి డామ్ కూల్" అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం 'భీష్మ' షూటింగ్ చివరి దశకొచ్చింది. శుక్రవారం రిలీజ్ చేసిన 'భీష్మ' సింగిల్‌కు మంచి స్పందనే వచ్చింది. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజవనున్నది.