మార్చి నుంచి తారక్ కొత్త చిత్రం!
on Dec 25, 2021

ఈ సంక్రాంతికి `ఆర్ ఆర్ ఆర్`తో సందడి చేయబోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. `స్టూడెంట్ నెంబర్ వన్`, `సింహాద్రి`, యమదొంగ` వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తారక్ చేసిన సినిమా కావడంతో.. నందమూరి అభిమానులు ఈ ఫిక్షనల్ పిరియడ్ డ్రామాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో హీరోగా దర్శనమివ్వనున్నాడు.
ఇదిలా ఉంటే.. `ఆర్ ఆర్ ఆర్` విడుదలైన రెండు నెలల తరువాత తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడట తారక్. `జనతా గ్యారేజ్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత విజనరీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్టీఆర్ చేయనున్న ఈ సినిమా.. మార్చి ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. అంతేకాదు.. నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఓ భారీ సెట్ రూపొందిస్తున్నారని, అందులోనే ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుందని బజ్. ఆపై చకచకా చిత్రీకరణ పూర్తిచేసి వచ్చే సంవత్సరం దసరా సీజన్ లో మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
మరి.. `జనతా గ్యారేజ్`తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తారక్ - కొరటాల.. కొత్త సినిమాతో ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



