శ్రుతి హాసన్ కి అతనితోనే ఫస్ట్ హ్యాట్రిక్ రాసి పెట్టి ఉందా!
on Dec 25, 2021

కథానాయికగా చెన్నై పొన్ను శ్రుతి హాసన్ ది పుష్కరకాల ప్రయాణం. ఈ 12 ఏళ్ళ సినీప్రస్థానంలో తెలుగు, తమిళ, హిందీ భాషలతో కలుపుకుని దాదాపు 30 చిత్రాల్లో హీరోయిన్ గా ఎంటర్టైన్ చేసింది శ్రుతి. అన్ని చోట్లా నటిగా తనదైన అభినయంతో అలరించింది.
ఇదిలా ఉంటే.. శ్రుతి కెరీర్ ని పరిశీలిస్తే ఇప్పటివరకు హరీశ్ శంకర్, హరి, గోపీచంద్ మలినేని, వేణు శ్రీరామ్ వంటి దర్శకులతో మాత్రమే రెండేసి సినిమాలు చేసింది. `గబ్బర్ సింగ్`, `రామయ్యా వస్తావయ్యా` చిత్రాల కోసం హరీశ్ కాంబినేషన్ లో.. `పూజై`, `ఎస్ 3` (సింగమ్ 3) సినిమాల కోసం హరి డైరెక్షన్ లో.. `బలుపు`, `క్రాక్` వంటి ప్రాజెక్ట్స్ కోసం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో.. `ఓ మై ఫ్రెండ్`, `వకీల్ సాబ్` కోసం వేణు శ్రీరామ్ నిర్దేశకత్వంలో నటించింది శ్రుతి హాసన్. అయితే, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మాత్రమే రెండు సార్లూ విజయాలు చూసింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. కట్ చేస్తే.. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో గోపీచంద్ మలినేని తీస్తున్న నయా వెంచర్ లోనూ శ్రుతినే నాయిక. మరి.. ఇప్పటికే గోపీచంద్ తో రెండు విజయాలు చూసిన శ్రుతి.. రాబోయే మూవీతో హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.
కాగా, త్వరలోనే పట్టాలెక్కనున్న బాలయ్య- శ్రుతి - గోపీచంద్ కాంబో మూవీ.. వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



