సాయం చేస్తున్న తాప్సీ మంచి మనసు..!
on May 18, 2016
కళాకారుల్లో స్పందించే తత్వం ఎక్కువగానే ఉంటుంది. ఎవరికైనా నిజంగా సాయం అవరసరమైనప్పుడు వీలైనంత వరకూ తోడ్పడుతుంటారు చాలా మంది కళాకారులు. ఈ కోవలోకే వస్తుంది హీరోయిన్ తాప్సి. ఇబ్బందుల్లో ఉన్న ఒక బాక్సర్ కు సాయపడి తాను వ్యక్తిగతంగా ఎంత అందమైనదో ప్రూవ్ చేసుకుంది ఈ భామ. విషయంలోకి వెళ్తే, హైదరాబాద్ కు చెందిన బాక్సర్ లిఖిత బత్తిని. రియో ఒలింపిక్స్ కు క్లాలిఫై అవ్వడం ఆమె కల. కానీ ఆర్ధికపరమైన ఇబ్బందులు ఆమెకు కలిసిరాలేదు. తనకు ఎవరైనా స్పాన్సన్ సాయం చేయాలని ఎదురుచూస్తున్న ఆమె పరిస్థితి తెలుసుకున్న తాప్సీ, తన చేయందించింది. ఒక ఎన్జీవో సాయంతో లిఖితకు అవసరమైన నిధుల్ని సమకూర్చుతూ, మంచితనం చాటుకుంటోంది. ఇప్పటికే భారీ మొత్తాన్ని సేకరించిన తాప్సీ, ప్రయాణానికి, ఎక్విప్ మెంట్ కు, ఆమెకు అవరసరమైన ప్రతీ వస్తువుకు నిధులు సమకూర్చింది. ఏదో డబ్బు సాయం చేసేసి చేతులు దులిపేసుకుందాం అనేలా కాకుండా, దగ్గరుండి అవసరమైన హెల్ప్ చేస్తున్న తాప్సీ మంచి మనసుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



