మళ్లీ బాలయ్య ఫ్యాన్స్ నే టార్గెట్ చేశావా నానీ..?
on May 18, 2016
.jpg)
వరస హిట్లతో ఫామ్ లో ఉన్నాడు హీరో నాని. చివరిగా వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాథలో నాని పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరో పాత్ర బాలకృష్ణకు హార్డ్ కోర్ ఫ్యాన్. ఈ ఒక్క ఎలిమెంట్ తో బాలయ్య ఫ్యాన్స్ ను కూడా హాళ్లకు రప్పించేశాడు హీరో గారు. అయితే ఈ సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందని భావించాడో ఏమో కానీ, తన తర్వాతి సినిమా జెంటిల్ మన్ ను బాలయ్య పుట్టినరోజునే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో న్యాచురల్ స్టార్ చేసిన లేటెస్ట్ మూవీ జెంటిల్ మన్. ఈ మధ్యే రిలీజైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీని బాలయ్య పుట్టినరోజైన జూన్ 10 న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట యూనిట్. బాలయ్య ఫ్యాన్స్ ను మళ్లీ టార్గెట్ చేసిన నాని, మరోసారి తనకు సూపర్ హిట్ కన్ఫామ్ అనే ఆశతో ఉన్నాడు. ఈ మూవీ టీజర్ ను, హీరోనా విలనా అంటూ జనాల్లో ఆసక్తిని రేపేలా కట్ చేశారు. సినిమాలో నాని రెండు రకాల షేడ్స్ లో కనిపిస్తాడని అనిపిస్తోంది. మరోసారి బాలయ్య సెంటిమెంట్ నానికి వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



