బ్రహ్మోత్సవం టైం వెనుక మహేష్ హ్యాండ్ ఉందా..?
on May 18, 2016

బ్రహ్మోత్సవం డ్యూరేషన్ 156 నిముషాలు. అంటే 2 గంటల 36 నిముషాలు. ఒక ఫ్యామిలీ సినిమా, అది కూడా అతి భారీ కాస్టింగ్ తో తెరకెక్కిన బ్రహ్మోత్సవం లాంటి మూవీకి ఇంత తక్కువ డ్యూరేషన్లో టైం ఫిక్స్ చేయడం నిజంగానే గొప్ప విషయంగా చెప్పాలి. ఫ్యామిలీ డ్రామాలకు సాధారణంగా లెంగ్త్ ఎక్కువ కావడానికి కారణం, సెంటిమెంట్ సీన్స్. బొమ్మరిల్లు క్లైమాక్స్ తరహాలో ఈ సీన్స్ చాలా సేపు ఉంటాయి. ఆర్టిస్టులందరి క్లోజప్ ఎక్స్ ప్రెషన్స్ వేసుకుంటూ పోవడం వలన డ్యూరేషన్ భారీగా పెరిగిపోతుంటుంది.

అందుకే బ్రహ్మోత్సవానికి కూడా డ్యూరేషన్ దాదాపు 2 గంటల 45 నిముషాలు వచ్చిందని, ఫైనల్ కాపీలో మహేష్ ఛేంజెస్ చెప్పిన తర్వాత 156 నిముషాలకు తగ్గిందని సినీజనాల టాక్. శ్రీకాంత్ అడ్డాల మహేష్ తో తీసిన సీతమ్మ వాకిట్లో సినిమాకు కూడా రన్ టైంభారీగానే వచ్చింది. అయితే బ్రహ్మానందం సీన్లన్నింటినీ తీసేసి, కాస్త లెంగ్త్ తగ్గించగలిగారు. బ్రహ్మోత్సవంలో కూడా షూట్ చేసిన సీన్లన్నీ పెడితే చాలా డ్యూరేషన్ వస్తుందని, అందుకే మొత్తం ట్రిమ్ చేసి మూవీని షార్ప్ గా చేశారని అంటున్నారు. వీటి వెనుక మహేష్ కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉందట. నిర్మాణంలో మహేష్ కూడా భాగస్వామి అన్న విషయం తెలిసిందే. అందుకే ఇంత జాగ్రత్త తీసుకున్నాడు సూపర్ స్టార్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



