'ఆదిపురుష్' యానిమేషన్ ఫిల్మ్‌లా ఉంది!.. 3డీలో గెటప్స్ మారిపోతాయా?
on Oct 10, 2022

ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీపై అభిమానులు, సాధారణ ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే ఆ మూవీపై అంచనాలు విపరీత స్థాయిలో ఉన్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం అయోధ్యలో రిలీజ్ చేసిన టీజర్ చూసి అందరూ షాకయ్యారు. ఎక్కువగా యానిమేషన్ ఫిల్మ్‌లా ఉందనీ, కొన్ని పాత్రల గెటప్స్ దారుణంగా ఉన్నాయంటూ ట్రోలింగ్ జరిగింది. అయితే ఆ తర్వాత హైదరాబాద్‌లో 3డీ టీజర్‌ను చూశాక, ఆ అభిప్రాయం మారిందంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
చిత్రసీమకు చెందిన సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం, 3డీలో చూసినంత మాత్రాన పాత్రధారుల గెటప్స్ ఏమైనా మారిపోతాయా? అని ప్రశ్నించారు. ప్రభాస్ యానిమేటెడ్ ప్రభాస్‌లాగా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించారు. తన సొంత యూట్యూబ్ చానల్‌లో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. "బడ్జెట్ 500 కోట్లు అని పబ్లిసిటీ చేశారు. అంత ఖర్చుపెట్టి బాంబేలో హిందీవాళ్లు తీస్తున్నారంటే చాలా ఎక్కువగా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశాం. దురదృష్టవశాత్తూ బాగా డిజప్పాయింట్ చేసింది. అది యానిమేషన్ సినిమాలాగా ఉంది. యానిమేషన్ సినిమాని ఎట్లా పెద్ద సినిమా అంటారో తెలీదు. చాలా మంది ట్రోల్ చేశారు." అని ఆయన అన్నారు.
"ఈ సినిమాని 3డీలో తీస్తున్నాం, 3డీలో చూస్తే ఎక్స్‌పీరియెన్స్ వేరుగా ఉంటుంది, సెల్ ఫోన్‌లో చూస్తే ఎక్స్‌పీరియెన్స్ వేరుగా ఉంటుందని డైరెక్టర్ గారు, హీరోగారు, అందరూ చెప్పారు. 3డీలో కానీ, 4డీలో కానీ, 2డీలో కానీ.. ఎందులో చేసినా, యానిమేషన్‌కీ, లైవ్‌కీ చాలా తేడా ఉంటుంది. కొచ్చాడయాన్ లాగా యానిమేషన్ ఫిల్మ్‌లా చేస్తున్నారనేది జనం ఫీలింగ్. వచ్చిన ట్రైలర్ కూడా అట్లాగే ఉంది." అని ఆయన అభిప్రాయపడ్డారు.
"రావణాసురుడు, హనుమంతుడి గెటప్స్ గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు. వానరులు అలా ఉన్నారేంటి అంటున్నారు. 'ప్లానెట్ ఆఫ్ ఏప్స్' సినిమాలో లాగా గంతులేస్తున్నారేంటి అనే డౌట్లు చాలామందికి ఉన్నాయి. ఆ డౌట్స్‌ని ఎక్కడా క్లియర్ చేయలేదు. 3డీలో చేసినా కాస్ట్యూమ్స్ మారిపోవు కదా, వాళ్ల గెటప్స్ మారవు కదా! ప్రభాస్‌గారు యానిమేటెడ్ ప్రభాస్ లాగా కనపడుతున్నాడు. 2డి నుంచి 3డిలోకి వెళ్తే యానిమేషన్ మారిపోతుందా? అది నాకు అర్థం కావట్లేదు." అని చెప్పుకొచ్చారు భరద్వాజ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



