ఐదు రోజుల్లో 50 కోట్ల షేర్.. 'గాడ్ ఫాదర్'కి అసలు పరీక్ష మొదలైంది!
on Oct 10, 2022

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' స్లో అండ్ స్టడీగా ఐదు రోజులు పూర్తి చేసుకుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఐదు రోజుల్లో రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అయితే మెగాస్టార్ క్రేజ్ తో భారీగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా.. హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే కొండంత బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.70.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'గాడ్ ఫాదర్' మొదటి రోజు రూ.12.97 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా రెండో రోజు రూ.7.73 కోట్ల షేర్, మూడో రోజు రూ.5.41 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.5.62 కోట్ల షేర్, ఐదో రోజు రూ.5.23 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.10.93 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.8.31 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.17.72 కోట్ల షేర్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఐదు రోజుల్లో రూ.36.96 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. అలాగే కర్ణాటకలో 4.25 కోట్ల షేర్, హిందీ+రెస్టాఫ్ ఇండియా 4.60 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 4.30 కోట్ల షేర్ కలిపి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50.11 కోట్ల షేర్(రూ.91 కోట్ల గ్రాస్) రాబట్టినట్టు సమాచారం.
'గాడ్ ఫాదర్'కి ఈరోజు(సోమవారం) నుంచి అసలు పరీక్ష ఎదురుకానుంది. నిన్నటితో దసరా సెలవులు ముగియడంతో నేటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి పూర్తిగా తగ్గిపోయే అవకాశముంది. ఈ క్రమంలో 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. వరల్డ్ వైడ్ గా రూ.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే ఇంకా రూ.41 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. మరి 'గాడ్ ఫాదర్' వీక్ డేస్ లోనూ ఇదే ఫ్లోని కొనసాగించి నష్టాల నుంచి తప్పించుకుంటుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే 'గాడ్ ఫాదర్' ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు నిన్ననే నిర్మాతలు పోస్టర్ విడుదల చేశారు. కానీ ట్రేడ్ విశ్లేషకులు మాత్రం ఈ చిత్రం ఐదు రోజుల్లో రూ.91 కోట్ల గ్రాస్ రాబట్టిందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



