'చెన్నకేశవ రెడ్డి' రీ-రిలీజ్ కలెక్షన్లు అన్ని కోట్లా!!
on Oct 10, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు వీవీ వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన 'చెన్నకేశవ రెడ్డి'(2002) విడుదలై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రెండు వారాల కిందట ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్పెషల్ షోలు వేసిన సంగతి తెలిసిందే. అయితే రీరిలీజ్ లో ఈ చిత్రం సాధించిన వసూళ్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
రీరిలీజ్ లో 'చెన్నకేశవ రెడ్డి'కి వచ్చే కలెక్షన్లను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి డొనేట్ చేస్తామని నిర్మాత బెల్లంకొండ సురేష్ ముందే ప్రకటించారు. ఈ మూవీ రీరిలీజ్ సమయంలో బాలయ్య అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఓవర్సీస్ లో కూడా 'చెన్నకేశవ రెడ్డి' రీరిలీజ్ మేనియా ఓ రేంజ్ లో కనిపించింది. దీంతో ఈ చిత్రం రీరిలీజ్ లో 'పోకిరి'(రూ.1.73 కోట్ల గ్రాస్), 'జల్సా'(రూ.3.20 కోట్ల గ్రాస్) సినిమాలు కలెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే కలెక్ట్ చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్టే అంచనాలకు మించిన కలెక్షన్స్ తో 'చెన్నకేశవ రెడ్డి' రీరిలీజ్ లో అదరగొట్టింది.
'చెన్నకేశవ రెడ్డి' చిత్రం రీరిలీజ్ లో ప్రపంచవ్యాప్తంగా రూ.5.39 కోట్ల గ్రాస్ రాబట్టిందని తాజాగా నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రకటించారు. ఇందులో మొత్తం షేర్ ని బసవతారకం ఆసుపత్రికి డొనేట్ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే 'ఆది' చిత్రాన్ని సరైన ప్లానింగ్, ప్రమోషన్స్ తో భారీ స్థాయిలో రీరిలీజ్ చేస్తామని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



