శరణ్య పెద్దకూతురు పెళ్లయింది!
on Jul 6, 2021

'నాయకుడు' (1987) సినిమాలో కమల్ హాసన్ జోడీగా నటించడం ద్వారా నటిగా పరిచయమై, తొలి చిత్రంతోటే ఆకట్టుకున్నారు శరణ్య. ఆ తర్వాత సంవత్సరమే 'నీరాజనం' (1988) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఆమె నేరుగా పరిచయమయ్యారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనా, అందులోని పాటలు అసాధారణ ప్రజాదరణ పొందడంతో ఆమకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. తర్వాత కాలంలో ఆమె తెలుగులో హీరోయిన్‌గా చేసింది సాహసం సినిమాలోనే. కొంతకాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చంటిగాడు, రాఖీ, జగడం, రెడీ, వేదం, పులి, మనం, బ్రహ్మోత్సవం చిత్రాల్లో నటించారు. చివరగా నాని సినిమా 'గ్యాంగ్ లీడర్'లో కనిపించారు.
కాగా, ఆమె తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్-డైరెక్టర్ పొన్‌వణ్ణన్‌ను 1995లో పెళ్లాడారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ప్రియదర్శిని, చాందిని. చెన్నైలో పెద్దకుమార్తె ప్రియదర్శిని వివాహ రిసెప్షన్ జరగగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ దీనికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

వివాహానంతరం చెన్నైలోని మనప్పాక్కమ్‌లో సోమవారం సాయంత్రం ఈ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు స్టాలిన్‌తో పాటు ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఎంపీ కనిమోళి తదితరులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి, వారిని ఆశీర్వదించారు. మొక్కలతో కూడిన గ్రీన్ బాస్కెట్లను వధూవరులకు స్టాలిన్ బహూకరించారు. నటి దేవదర్శినితో పాటు, శరణ్యతో గ్యాంగ్ లీడర్‌లో నటించిన హీరోయిన్ ప్రియాంక అరుళ్‌మోహన్ కూడా ఈ వేడుకకు హాజరైన వారిలో ఉన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



