నమ్మిన వ్యక్తే మోసం చేశాడు.. ఐశ్వర్య రాజేష్ ఆవేదన
on Jul 6, 2021

విభిన్న పాత్రలు, చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ముఖ్యంగా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే, తాను ఎంతో నమ్మిన వ్యక్తే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడని తాజాగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తాను ఎంతో నమ్మిన వ్యక్తి.. అభిమానుల నుంచి డబ్బులు తీసుకుని, తన వ్యక్తిగత వివరాలను లీక్ చేశాడని.. ఆ విషయాన్ని తెలుసుకుని తాను షాక్ కు గురయ్యానని ఐశ్వర్య చెప్పింది. తన వెంట ఉంటూనే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పలువురు సలహా ఇచ్చారని.. కానీ ఇప్పటికే తప్పు జరిగిపోయిందని.. ఇకపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఐశ్వర్య తెలిపింది.
తనని మోసం చేసిన ఆ వ్యక్తికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని.. ఇలాంటి నమ్మకద్రోహాలు మరొకరికి చేయవద్దని సూచిస్తున్నానని చెప్పింది. ఇలాంటి కొందరు వ్యక్తులు చేసే పనుల వల్ల.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. అయితే, ఇకపై జాగ్రత్తగా ఉండాలనే విషయం మాత్రం అర్థమయిందని ఐశ్వర్య పేర్కొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



