తెలుగు సినిమా అంటే తమన్నాకి అంత లోకువా??
on Aug 20, 2016

చేతిలో హిట్స్ ఉన్నా లేకున్నా... పారితోషికం విషయంలో ఏమాత్రం రాజీ పడరు కథానాయికలు. పైసా తగ్గితే.. సెట్‌కి రానని మారాం చేస్తారు. పైగా సకల సౌకర్యాలు కల్పించాల్సిందే. ఒక్క హిట్టు పడితే.. పారితోషికం అమాంతంగా డబుల్ చేస్తారు. అడిగినంత ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. అయితే మన కథానాయికల పప్పులన్నీ ఇక్కడే. బాలీవుడ్‌లో మాత్రం అలా కాదు. అక్కడ వాళ్లు ఇచ్చినంత పుచ్చుకోవాల్సిందే. సెవెన్ స్టార్ వసతులు డిమాండ్ చేస్తే.. `వద్దు పొండి` అంటారు. వాళ్లు అలా అనక ముందే.. ఇక్కడి కథానాయికలంతా బాలీవుడ్‌లో రిబేట్ల వర్షం కురిపిస్తుంటారు. ఇప్పుడు తమన్నా కూడా అంతే. హిమ్మత్ వాలాతో తమన్నాకి బాలీవుడ్ లో అట్టర్ ఫ్లాప్ తగిలింది. ఆ దెబ్బకు బాలీవుడ్ వద్దు బాబోయ్ అనుకొంది. అయితే బాహుబలి వల్ల.. అక్కడి నుంచి తమన్నాకి మంచి అవకాశాలొస్తున్నాయి. తాజాగా రెండు సినిమాలపై సంతకాలు పెట్టింది. అయితే పారితోషికం విషయంలో మాత్రం పెద్ద మనసు చేసుకొంది. `పారితోషికం ఇంత ఇవ్వండి అని డిమాండ్ చేయను. మీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి` అంటోందట. తెలుగులో తమన్నా ఇలా ఏనాడైనా ఆఫర్లు ఇచ్చిందా? స్పెషల్ సాంగ్‌కి అరకోటి తగ్గని ఈ అమ్మడు...అక్కడ మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు ఎలా ఇస్తోంది. తెలుగు సినిమా అంటే అంత లోకువా? తమన్నా అనే కాదు. దాదాపు అందరి పరిస్థితీ అంతే. తెలుగు సినిమాల వల్లే ఇంత గుర్తింపు వచ్చింది అనికూడా మర్చిపోతుంటారు. ఆ జాబితాలో ఇప్పుడు తమన్నా కూడా చేరిపోయిందన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



