రేంజ్ పెంచేశావ్ రాజా....!
on Aug 20, 2016
ఈరోజుల్లో బడా హీరోల్ని నమ్ముకొని సినిమాల్ని తీయడం కంటే.. కుర్ర హీరోలతో ఎడ్జస్ట్ అయిపోవడమే సుఖం. ఎందుకంటే ఎప్పుడు ఏ సినిమా బాక్సాఫీసుని బద్దలు కొడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. పెళ్లి చూపులు లాంటి సినిమాలు కోట్లు కొల్లగొట్టి.. వాళ్ల స్టామినాని నిరూపిస్తున్నాయి. అందుకే శర్వానంద్, నాని, సాయిధరమ్ తేజ్ లాంటి వాళ్లు దూసుకుపోతున్నారు. వాళ్లకు అవకాశాలు పెరుగుతున్నాయి.. దాంతో పాటు రెమ్యునరేషన్ కూడా భారీగా అందుతోంది. తాజాగా శర్వానంద్ కూడా తన రేంజ్ బాగా పెంచేశాడట. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి మాసీ హిట్లతో ఫామ్ లోకి వచ్చేశాడు శర్వానంద్. ఇప్పటి వరకూ రూ.1 కోటికి అటూ ఇటూగా ఉన్న శర్వా పారితోషికం తాజాగా డబుల్ అయినట్టు టాక్. చంద్రమోహన్ అనే ఓ యువ దర్శకుడితో శర్వా ఓ సినిమా చేస్తున్నాడు. అందుకోసం ఏకంగా రూ.2.25 కోట్లు పారితోషికం తీసుకొన్నాడట. అంటే డబుల్ కంటే ఎక్కువ. లేదంటే ఓవర్సీస్ రైట్స్ రాసివ్వమంటున్నాడట. ఓవర్సీస్‌ని ముట్టజెప్పడం కంటే రెండు కోట్లు ఇవ్వడమే బెటర్ అని నిర్మాతలు ఫీలవుతున్నారు. ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు ఓ రేంజులో ఉంది. చిన్న సినిమాలకు అక్కడ కాసుల పంట పండుతోంది. అందుకే శర్వాలాంటి వాళ్లు కూడా ఇలా ముక్కు పిండి వసూలు చేసేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



