ఆ హీరోతో మరోసారి తమన్నా?
on Jan 19, 2021
మిల్కీ బ్యూటీ తమన్నాకి అచ్చొచ్చిన కథానాయకుల్లో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒకరు. 2009 పొంగల్ స్పెషల్ గా విడుదలైన తమిళ చిత్రం పడిక్కాదవన్.. ఈ ఇద్దరి జోడీకి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత వీరి కాంబినేషన్ లో వేంగై వచ్చింది. ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. కట్ చేస్తే.. పదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ధనుష్, తమన్నా ముచ్చటగా మూడోసారి జట్టుకట్టబోతున్నారని కోలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. ధనుష్, దర్శకుడు సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో నానే వరువేన్ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కథానాయిక పాత్ర కోసం తమన్నాతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. త్వరలోనే నానే వరువేన్ లో తమన్నా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
నానే వరువేన్ కి యువన్ శంకర్ రాజా బాణీలు అందించనుండగా... అరవింద్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.