ఆఫ్ట్రాల్ ఎస్ఐ.. వాడు అరిస్తే భయపడతానా!
on Dec 14, 2021

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సర్ ప్రైజ్ వీడియో విడుదలైంది.
Also Read: సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు!
నేడు(డిసెంబర్ 14) రానా పుట్టినరోజు సందర్భంగా రానాకి విషెస్ చెబుతూ 'స్వాగ్ ఆఫ్ డేనియల్ శేఖర్' పేరుతో ఓ వీడియోని విడుదల చేశారు మేకర్స్. "వాడు అరిస్తే భయపడతానా.. వాడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు?.. దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్ఐ.. సస్పెండెడ్" అంటూ భీమ్లా నాయక్(పవన్)ని ఉద్దేశించి రానా చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంది. గతంలో విడుదలైన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ లో 'రేయ్ డేని.. బయటకి రారా నా కొడకా' అంటూ పవన్ గర్జించాడు. ఇప్పుడు తాజాగా విడుదలైన వీడియోలో రానా కూడా 'వాడు అరిస్తే భయపడతామా' అంటూ అదేస్థాయిలో గర్జించాడు. ఇద్దరు హీరోలు బిగ్ స్క్రీన్ పై ఇలా పోటాపోటీగా గర్జిస్తూ నటిస్తే చూడటానికి రెండు కళ్ళు సరిపోవేమో.
Also Read: 'విరాట పర్వం' నుంచి పవర్ ఫుల్ వీడియో
'భీమ్లా నాయక్'లో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



