షాకింగ్: సుశాంత్‌సింగ్ కాళ్లపై దెబ్బల గుర్తులు!
on Aug 10, 2020

జూన్ 14న సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన దగ్గర్నుంచీ ఆయన ఫ్యామిలీకి, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు విశ్రాంతి అనేది లేదు. మొదట్లో సుశాంత్‌సింగ్ మృతిని ఆత్మహత్యగానే భావించినా, ఆయన మృత శరీరం ఫొటోలు వైరల్ అయ్యాక, అది ఆత్మహత్య కాదని అత్యధికులు నమ్ముతూ వస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసుల వల్ల నిజం బయటపడే అవకాశాలు కనిపించకపోవడంతో, సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఈ కేసులో ప్రాథమిక నిందితురాలిగా ఆరోపిస్తూ ఆయన తండ్రి పాట్నాలో పోలీసు కేసు పెట్టారు.
ఆ తర్వాత అనేక రకాల వాదనలు వెలువడ్డాయి, కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. లేటెస్ట్‌గా సుశాంత్‌సింగ్ మృతదేహాన్ని ముంబైలోని కూపర్ హాస్పిటల్‌కు తరలించిన అంబులెన్స్ అటెండెంట్ ముందుకు వచ్చి, కొన్ని దిగ్భ్రాంతి కలిగించే విషయాలు చెప్పాడు. సుశాంత్ డెడ్ బాడీని అతి దగ్గరగా చూసిన అతను, ఆ బాడీ పసుసు రంగులోకి మారిపోయి ఉందనీ, సుశాంత్ కాళ్లపై చారల గుర్తులు ఉన్నాయనీ వెల్లడించాడు. పైగా ఆ కాళ్లు వంగిపోయి ఉన్నాయనీ, ఆత్మహత్య కేసులో ఇది అసాధారణమనీ అతను తెలిపాడు. అంతేకాకుండా, సుశాంత్ నోటి నుంచి ఎలాంటి నురగ వచ్చిన దాఖలాలు లేవనీ, అతడి మెడపై ఉరి బిగిసిన గుర్తులు కూడా ఒక పద్ధతిలో లేవనీ, తన అనుభవం ప్రకారం అలా ఉండటం కూడా అసాధారణమేననీ చెప్పాడు.
ఇదివరకు సుశాంత్ మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య సైతం సుశాంత్ మెడపై ఉన్న చారలు ఉరివేసుకున్నట్లు లేవనీ, సుశాంత్ పెట్ డాగ్ ఫడ్జ్‌కి వేసే బెల్ట్‌తో బిగించి చంపిన చారల్లాగా ఉన్నాయనీ ఆరోపించిన విషయం గమనార్హం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



