మహేశ్ బిజినెస్ పార్టనర్ సునీల్ నారంగ్‌కు గుండె ఆపరేషన్
on Aug 10, 2020

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, ఏషియన్ గ్రూప్ అధినేతల్లో ఒకరైన సునీల్ కె. నారంగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి గుండె నొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేసి స్టంట్ వేశారు. అయితే సునీల్ నారంగ్ పరిస్థితి విషమంగా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావడంతో తన సోదరుని ఆరోగ్య పరిస్థితితో సునీల్ సోదరుడు భరత్ నారంగ్ వివరణ ఇచ్చారు.
"రాత్రి సడెన్‌గా గుండె నొప్పి రావడంతో నా సోదరుడు అపోలో హాస్పిటల్ లో చేరారు. డాక్టర్స్ వెంటనే స్టంట్ వేశారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. రేపు డిశ్చార్జ్ అవుతారు. తన ఆరోగ్యం గురించి ఫోన్లు చేస్తున్న అందరికీ సునీల్ నారంగ్ కృతజ్ఞతలు తెలిపారు. తాను క్షేమంగా ఉన్నట్లు, రేపు డిశ్చార్జ్ అవుతున్నట్లు తెలుపమన్నారు." అని ఆయన చెప్పారు. గచ్చిబౌలి ప్రాంతానికి కీలకంగా మారిన ఏఎంబీ మాల్‌లో హీరో మహేశ్, సునీల్ నారంగ్ భాగస్వాములు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



