తన కంటే ఆరేళ్ల చిన్నోడితో ఐటమ్ గాళ్ ప్రేమ
on Aug 10, 2020

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ చిత్రంలో ఐటమ్ సాంగ్ ‘నా పేరే కాంచనమాల... నా వయసే గరం మలాసా’ ఉందిగా! అందులో చిరుతో చిందేసిన ఐటమ్ గాళ్ గౌహర్ ఖాన్ గుర్తుందా? ఆ తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. కానీ, హిందీలో వచ్చాయి. అక్కడ కొన్ని సినిమాలు చేసింది. ‘బిగ్ బాస్ 7’ విన్నర్‌గా నిలిచింది. టీవీ రియాలిటీ షోలు చేసింది. అసలు మేటర్ ఏంటంటే... గౌహర్ ఖాన్ లేటెస్ట్‌గా ప్రేమలో పడింది. తన కంటే వయసులో ఆరేళ్లు చిన్నోడైన వ్యక్తిని ప్రేమిస్తోంది. అదీ సంగతి! ప్రేమ విషయాన్ని గౌహర్ చెప్పలేదు. కానీ, ఆమెతో ప్రేమలో ఉన్న వ్యక్తి ఇద్దరూ దిగిన ఫొటోలు పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జాయేద్ దర్బార్‌తో గౌహర్ ప్రేమలో పడింది. ఆమెతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన దర్బార్ ‘‘ఆమె మనసు తీయనైనది’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఫొటో గురించి గౌహర్‌ను బాలీవుడ్ మీడియా అడగ్గా... ‘‘ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా?’’ అని ప్రశ్నించింది. ఆమె సన్నిహితులు మాత్రం ప్రేమలో ఉన్నారని చెబుతున్నారట. ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఉన్నప్పుడు కౌషల్ టాండన్‌తో గౌహర్ ప్రేమలో పడింది. హౌస్ నుండి బయటకొచ్చిన తర్వాత కొన్నాళ్లు మాత్రమే డేటింగ్‌లో ఉన్నారు. తరవాత విడిపోయారు. అందువల్ల, ఈసారి లవ్ మేటర్‌ను దాస్తున్నట్టుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



