సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ని వంద సార్లు చూసిన దర్శకుడు..ఇది టూరిస్ట్ ఫ్యామిలీ
on May 24, 2025

గత నెల ఏప్రిల్ 29 న శశికుమార్(M. Sasikumar)సిమ్రాన్(Simran)జంటగా 'అబీషాన్ జీవింత్'(Abishan Jeevinth)దర్శకత్వంలో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'టూరిస్ట్ ఫ్యామిలీ'(Tourist Family). కామెడీ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మాణం జరుపుకోగా, ఇప్పటి వరకు డెబ్భై ఐదు కోట్ల రూపాయిల దాకా వసూలు చేసింది. ఈ విషయాన్నీ చిత్ర బృందం అధికారకంగా వెల్లడి చెయ్యడంతో, మూవీ సాధించిన విజయం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. రజనీకాంత్(Rajinikanth),శివ కార్తికేయన్(Siva karthikeyan)రాజమౌళి(Rajamouli)లాంటి పలువురు సినీ ప్రముఖులు టూరిస్ట్ ఫ్యామిలీ చాలా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ కోవలోనే రీసెంట్ గా సూర్య(Suriya)దర్శకుడు అబీషాన్ జీవింత్ తో పాటు టీం ని కలిసి అభినందించడం జరిగింది. దీంతో ఈ విషయంపై అబీషాన్ జీవింత్ 'ఎక్స్'(X)వేదికగా స్పందిస్తు 'సూర్య నన్ను కలిశారు. మూవీ ఆయనకి ఎంత బాగా నచ్చిందో చెప్పారు. ఈ అనుభూతిని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. ఎప్పట్నుంచో ఉన్న బాధ ఇప్పుడు తీరినట్టుగా ఉంది. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ని వంద సార్లు చూసిన నేను ఇప్పుడు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాను అంటు ట్వీట్ చేసాడు.
టూరిస్ట్ ఫ్యామిలీ' ని మిల్లన్ డాలర్ స్టూడియోస్, ఎం ఆర్ పి ఎంటర్ టైన్మెంట్ సంయుక్తగా నిర్మించగా యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ రోజు నుంచి జపాన్ లో కూడా ప్రదర్శితం కానుంది. ముందు ముందు తెలుగులోకి ఏమైనా డబ్ అవుతుందేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



