హిట్ 3 ఓటిటి డేట్ ఇదే
on May 24, 2025
నాచురల్ స్టార్ 'నాని'(Nani)మే 1 న వరల్డ్ వైడ్ గా 'హిట్ 3'(Hit 3)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో 'అర్జున్ సర్కార్' గా నాని తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. నానితో పాటు మిగతా క్యారక్టర్ లలో చేసిన నటీనటులు కూడా తమ క్యారెక్టర్ల మేరకు మంచి పెర్ఫార్మెన్సు ని ప్రదర్శించి చిత్ర విజయానికి దోహదపడ్డారు. కలెక్షన్స్ పరంగా కూడా వంద కోట్ల మార్కుని అందుకొని నాని కెరీర్ లోనే మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇప్పుడు ఈ మూవీ ఈ నెల 29 నుంచి ఓటిటి లో 'నెట్ ఫ్లిక్స్'(Netflix)వేదికగా ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ సదరు సంస్థ అధికారంగా వెల్లడి చేసింది. దీంతో ఓటిటి సినీప్రియుల్లో పండుగ వాతావరణం వచ్చిందని చెప్పవచ్చు. శ్రీనిధిశెట్టి(Srinidhi Shetty)సూర్య శ్రీనివాస్, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాధ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన హిట్ 3 కి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.
వాల్ పోస్టర్ సినిమా, యునానమిస్ ప్రొడక్షన్స్ పై నాని, ప్రశాంతి తిప్పరనేని నిర్మించగా మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందించాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
