హరిహర వీరమల్లు రిలీజ్ పై కుట్ర నిజమేనా? విచారణకి ఆదేశించిన మంత్రి
on May 24, 2025
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహరవీరమల్లు(Hari Hara veeramallu)మొదటిభాగం జూన్ 12 న విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత వీరమల్లు థియేటర్స్ లోకి అడుగుపెడుతుండటంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వగా మరికొన్ని రోజుల్లో సదరు ప్రమోషన్స్ లో వేగం పెరగనుంది. డిప్యూటీ సిఎంగా బిజీగా ఉండటంతో పవన్ ప్రమోషన్స్ లో పాల్గొనడం కష్టమనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని ఈవెంట్స్ లో పవన్ పాల్గొనబోతున్నట్టుగా
తెలుస్తుంది.
ఇక జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ థియేటర్స్ ని మూసివేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో పవన్ అభిమానుల్లో వీరమల్లు రిలీజ్ పై టెన్షన్ మొదలైంది. అద్దె ప్రాతిపదికిన సినిమాలు ప్రదర్శిస్తుండంతో ఆదాయం సరిపోవడం లేదని, మల్టిప్లెక్స్ తరహాలోనే పర్శంటేజ్ ఇవ్వాలనేది థియేటర్ యాజమానుల ప్రధాన డిమాండ్. అయితే ఈ నిర్ణయం వెనుక కొంత మంది సినీ పెద్దలు ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి తో మాట్లాడుతు సినిమా హాళ్ల మూసివేత కారణంగా ఎన్ని సినిమాలు నష్టపోతాయి.ఎంత టాక్స్ రెవిన్యూ కి ఇబ్బంది కలిగిస్తుంది. థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ లు ఒక గ్రూప్ లాగా ఏర్పడి మూసివేత నిర్ణయాలు తీసుకోవడం వెనక ఎవరైనా ఉన్నారా అని విచారించాలని చెప్పడం జరిగింది.
రీసెంట్ గా థియేటర్ల బంద్ అంశంపై థియేటర్ యాజమాన్యం,డిస్ట్రిబ్యూటర్ లతో కొంత మంది నిర్మాతలు సమావేశం నిర్వహించారు. కానీ ఈ సమావేశంలో సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



