మహేష్ బాబు తో పరిణీతి చోప్రా ఫిక్స్..!
on May 13, 2016

చాలా రోజులుగా మహేష్ మురుగదాస్ సినిమాకు హీరోయిన్ ఎవరన్నదానిపై చర్చ నడుస్తోంది. హీరోయిన్ గా అలియా భట్, దీపికా పదుకొనే, పరిణీతి చోప్రా పేర్లు వినబడ్డాయి. ఎట్టకేలకు పరిణీతి చోప్రాను ఫిక్స్ చేశారని సమాచారం. తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తారట. పరిణీతిని తీసుకుంటారని గురించి చాలా కాలంగా వార్తలు వచ్చినా, ఆమె ఖండిస్తూ వచ్చింది. అయితే, సౌత్ లో మహేష్ సరసన యాక్ట్ చేయమంటే నాకు ఓకే అంటూ స్టేట్ మెంట్ మాత్రం ఇచ్చింది. తాజా అప్ డేట్ ప్రకారం, ఈ భామను ఫిక్స్ చేయడమే కాక కాంట్రాక్ట్ కూడా సైన్ చేసుకున్నారట. టాలీవుడ్ లో నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా స్టార్ట్ అవకుండానే మహేష్ మురుగదాస్ సినిమాకు మంచి మౌత్ టాక్ ఉంది. ఇప్పటి వరకూ సూపర్ స్టార్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తారట. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా మురుగదాస్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. సౌత్ ఇండియా అంతా మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్న మహేష్ కు ఈ మూవీ కీలకం కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



