ఎన్టీఆర్ అంటేనే భయపడుతున్న సమంత..!
on May 13, 2016

తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా అగ్రస్థానంలో కొనసాగుతోంది సమంత. అందంతో పాటు ఈ భామకు అభిమానులు కూడా ఎక్కువే. వాళ్లతో టచ్ లో ఉండటం కోసం రెగులర్ గా ట్విట్టర్ అప్ డేట్స్ ఇస్తుంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు, వాళ్లడిన ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు కూడా చెబుతుంది. తాజాగా తన అభిమానులతో ఆమె క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఇచ్చింది. ఈ సమయంలో ఎన్నో ప్రశ్నలకు ఆసక్తికరమైన జవాబులిచ్చిందీ భామ. తాను కలిసి నటించిన హీరోలందరిలోనూ ఎన్టీఆర్ తో డ్యాన్స్ వేయడమంటే చాలా భయమట. ఆయన స్పీడ్ ను అందుకోవడం చాలా కష్టమని చెబుతోంది. ఇక తనకు అస్సలు ఇష్టం లేని ప్రశ్నలు రెండున్నాయి. ఒకటి మీ ఫేవరెట్ హీరో ఎవరు..రెండోది, షూటింగ్ టైం లో జరిగిన ఓ సంఘటన చెప్పండి. ఈ రెండు ప్రశ్నలు ఎవరైనా అడిగితే వెంటనే కోపం నషాళానికెక్కుతుందట. తను బాధలో ఉన్నప్పుడు కుక్కపిల్లలతో ఆడుకోవడం ద్వారా రిలీవ్ అవుతానని చెప్పుకొస్తోంది. సినిమాల విషయానికొస్తే సమంతకు ఈ సమ్మర్ బాగా కలిసొచ్చింది. ఆమె నటించిన నాలుగు సినిమాలు సమ్మర్ కే సిద్ధమయ్యాయి. వాటిలో తేరీ, 24 రిలీజై సూపర్ హిట్టయ్యాయి. ఇక బ్రహ్మోత్సవం, అ..ఆ రిలీజ్ కావాల్సి ఉంది. ఇవి కూడా హిట్టైతే, సమంత కెరీర్ పీక్స్ కు చేరుకున్నట్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



