ఆ హీరో మంచి గ్రంథసాంగుడు సుమీ..!
on May 13, 2016

కపూర్ల వారి వారసుడు అర్జున్ కపూర్ మంచి గ్రంథసాంగుడు అన్న పేరు సంపాదించుకుంటున్నాడు. ఇప్పటికే మలైకా అరోరా ఖాన్ తో యవ్వారం నడుపుతున్నట్టు వార్తలు వస్తుంటే, తాజాగా మరో అమ్మడిని తగులుకున్నాడట. లాస్ట్ ఇయర్, హీరో అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అథియా శెట్టి. ఈ భామతో మనోడు ఎఫైర్ నడిపేస్తున్నాడట. ఇన్నాళ్లూ బాలీవుడ్ మీడియా ఎంత అడిగినా, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చిన ఈ కపుల్, రీసెంట్ గా ఒక నైట్ క్లబ్బులో చుంబనాలతో రెచ్చిపోయి దొరికిపోయారట. సమయానికి ఎవరూ ఫొటోలు తీయకపోవడంతో విజువల్స్ మిస్ అయినా, చూసినోళ్ల నోళ్లు ఖాళీగా ఉండవు కదా. పొద్దున్న కల్లా వీళ్లిద్దరి ఎఫైర్ గురించి మీడియాకు తెలిసిపోయింది. అయితే అర్జున్ మాత్రం " మీ అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడేయకండి, సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్ షిప్ కామన్, మీకు ఆ విషయం అర్ధంకాదా..అథియా నా సిస్టర్ కు ఫ్రెండ్, తర్వాత నాకు ఫ్రెండ్ అంతే..ఇంకేమీ లేదు " అని కవర్ చేయడానికి ట్రై చేశాడు. ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ లా ఉండాలి కానీ, ఆ అధర చుంబనాలెందుకు సారూ...! బాలీవుడ్ లో ఫ్రెండ్షిప్ అంటే అంతేనేమో..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



